బోనాలుకు 20 కోట్లు, రంజాన్ కు 30 కోట్లా? - బండి సంజయ్
బోనాలు, గణేశ్ ఉత్సవాలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బోనాలను రాష్ట్ర పండగగా ప్రకటించిన ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. రంజాన్‌కు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. హిందూ పండగల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Login
Comments (0)