బీమా లేని వాహనాలకు ఇంధనం వద్దు: సుప్రీంకోర్టు
బీమా అమల్లో ఉన్న వాహనాలకే ఇంధనం సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఐఆర్డీఏ పైలట్ ప్రాజెక్టు అమలు చేసి, కేంద్ర రహదారి రవాణా శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. బీమా తీసుకునే వరకు వాహనాలకు ఇంధనం అందకుండా చూడాలని పేర్కొంది. 1996లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద పరిహారం కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది.
Login
Comments (0)