మద్యం కుంభకోణంలో కిరణ్ రెడ్డి ది కీలక పాత్ర: సిట్
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ-9 నిందితుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి కీలక ఆర్థిక నిర్వాహకుడిగా వ్యవహరించినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. అక్రమంగా సంపాదించిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించడంతో పాటు, 2024 ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు కార్లలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి నగదు తరలించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ముడుపుల సేకరణకు ఐఐటీ పట్టభద్రులను కలెక్షన్ ఏజెంట్లుగా వినియోగించి, ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా వ్యవహారాలు నడిపినట్లు వెల్లడించింది.
Login
Comments (0)