ఉదయ్‌కు మరో మహిళతోనూ సాన్నిహిత్యం
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదుతో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అశోక్‌నగర్‌లోని ఆయన గదిలో నిర్వహించిన సోదాల్లో ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్, రెండు ప్రేమలేఖలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళతో ఆయనకు సన్నిహిత పరిచయం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. లివ్-ఇన్ రిలేషన్‌కు ఉదయ్ ప్రతిపాదించినా, చట్టపరమైన కారణాలతో ఆమె నిరాకరించినట్టు సమాచారం. ఇదే మహిళను ట్రైనీ మహిళా ఐపీఎస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలిసి, తనపై ఉదయ్ దాడులు, వేధింపుల గురించి చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు సుమారు 20 మంది వాంగ్మూలాలు నమోదు చేసిన దర్యాప్తు అధికారులు, బాధితురాలి గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఫోన్ లాక్కున్నాడనే ఆరోపణలకు కూడా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Login
Comments (0)