రఘురామకృష్ణరాజుపై సీబీఐకి పీవీ సునీల్‌కుమార్ ఫిర్యాదు
రిటైర్డ్ డీజీ పీవీ సునీల్‌కుమార్, మాజీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు సీబీఐ కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, అవసరమైతే భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 35 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరారు. ఫిర్యాదుకు మాదాల శ్రీనివాస్ ఇచ్చిన పోలీసు ఫిర్యాదును, ఆంధ్రజ్యోతి వార్తా కథనాన్ని ఆధారంగా జత చేశారు.
Login
Comments (0)