మెడికవర్ ఆస్పత్రికి రూ.61.62 లక్షల జరిమానా
వైద్య నిర్లక్ష్యం కేసులో నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు మెడికవర్ హాస్పిటల్స్ (పూర్వం సింహపురి ఆస్పత్రి)పై రూ.61.62 లక్షల పరిహారం విధించింది. 2017లో సైనసైటిస్ శస్త్రచికిత్స సమయంలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన చెవురు సురేష్‌బాబు ఎడమ కంటి చూపు కోల్పోవడంతో ఈ కేసు దాఖలైంది. అదనపు వైద్య ఖర్చులకు రూ.21.62 లక్షలు, శారీరక, మానసిక వేదనకు రూ.40 లక్షలు 45 రోజుల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Login
Comments (0)