మెగా డీఎస్సీపై వైసిపి పిటిషన్ ను నిరాకరించిన హైకోర్టు
మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. వైసిపి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా, స్పోర్ట్స్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి పిల్లను అనుమతిస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యాల ఉద్దేశమే దెబ్బతింటుందని కోర్టు వ్యాఖ్యానించింది.
Login
Comments (0)