15లోగా నిర్ణయం లేదంటే ఉద్యమం: బొప్పరాజు
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి కాలయాపన చేయడం సరికాదని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 15లోగా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విజయవాడలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
Login
Comments (0)