హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమలో గద్దర్ అవార్డులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. 2025 సంవత్సరానికి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు టీజీఎఫ్డీసీ ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలు అర్హులు. చిత్ర పరిశ్రమలో 17 విభాగాలతో పాటు వ్యక్తిగత విభాగాల్లోనూ దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి ఈ నెల 31 వరకు కొనసాగుతుంది.
Comments (0)