బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ గుప్తా కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన తన ముంబయిలోని నివాసంలో బాత్రూమ్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం. ఈ గాయం కారణంగానే సంజయ్ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మరణవార్తను ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ అధికారికంగా ధ్రువీకరించారు.
సంజయ్ గుప్తా అకస్మాత్తు మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు ఆయన హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ముంబయి అండర్వరల్డ్, క్రైమ్ మరియు యాక్షన్ నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించడంలో సంజయ్ గుప్తా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు.
ఈయన 1994లో విడుదలైన ‘ఆతిష్’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘కాంటే’, ‘జిందా’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్వాలా’, ‘షూటౌట్ ఎట్ వడాలా’, ‘కాబిల్’, ‘జజ్బా’, ‘ముంబై సాగా’ వంటి విజయవంతమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా, రచయితగానూ ఆయన తన ప్రతిభను చాటుకుని చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు.
Don’t receive OTP? Resend