విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం సంభవించింది. రిఫైనరీ ప్రాంగణంలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతోపాటు దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే హెచ్పీసీఎల్ సేఫ్టీ వింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంస్థ అధికారులు ఆరా తీస్తున్నారు. రిఫైనరీ పరిధిలో చిన్నపాటి పేలుడు జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Don’t receive OTP? Resend