ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత వార్డులు మరియు డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు వెల్లడైన అనధికారిక ఫలితాల వివరాల ప్రకారం అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
ప్రధాన కార్పొరేషన్లలో కూటమి మేయర్ అభ్యర్థులు బలమైన లీడ్ సాధించారు. విశాఖపట్నంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి, గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, విజయనగరంలో అవనాపు భార్గవి, చిత్తూరులో కఠారి హేమలత, కర్నూలులో విజయ ప్రత్యూష ముందంజలో ఉన్నారు. అలాగే ఏలూరులో జనసేన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
వివిధ మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లోనూ కూటమి పార్టీల హవా కనిపిస్తోంది. నర్సీపట్నం, పెనుకొండ, వెంకటగిరి, నందిగామ, పలమనేరు, జగ్గయ్యపేట, నందికొట్కూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, నూజివీడు, మార్కాపురం, ఎమ్మిగనూరు, మాచర్ల, డోన్, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో తెదేపా అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అటు అమలాపురం, మడకశిర, నరసాపురం, తిరువూరు, గొల్లప్రోలు, సామర్లకోటలో జనసేన అభ్యర్థులు, గిద్దలూరు, ఎలమంచిలిలో భాజపా అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Don’t receive OTP? Resend