ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2026 విజేతల జాబితా విడుదలైంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ సినిమా ఈ వేడుకలో సత్తా చాటింది. ప్రధాన విభాగాల్లో ఏకంగా 12 అవార్డులను సొంతం చేసుకుని చిత్ర పరిశ్రమలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అబుదాభిలో అక్టోబరు 22న అవార్డుల బహుకరణ కార్యక్రమం జరిగింది.
ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన రణ్వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడిగా సంజయ్ దత్, ఉత్తమ విలన్గా అక్షయ్ ఖన్నా, ఉత్తమ సంగీత దర్శకుడిగా శాశ్వత్ సచ్దేవ్ తదితర విభాగాల్లో ధురంధర్ విజయాలు సాధించింది.
ఇతర విభాగాల్లోనూ పలు చిత్రాలు పురస్కారాలు దక్కించుకున్నాయి. ‘సైయారా’ చిత్రంలో నటించిన అనీత్ పడ్డా ఉత్తమ నటిగా ఎంపిక కాగా, ఇదే సినిమాకు ఇర్షాద్ కామిల్ ఉత్తమ గీత రచయితగా నిలిచారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ నిలవగా, ‘ఛావా’ సినిమా పలు సాంకేతిక విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది.
Don’t receive OTP? Resend