రంజీ ట్రోఫీలో విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న మధ్యప్రదేశ్ జట్టు హర్ష్ దూబే స్పిన్ ఉచ్చులో చిక్కుకుంది.
మ్యాచ్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్ష్ దూబే, నాలుగు మెయిడిన్లతో కేవలం 53 పరుగులు మాత్రమే ఇచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. గతంలో 1967-68 సీజన్లో మధ్యప్రదేశ్‌పైనే విదర్భ బౌలర్ అరుణ్ ఓగిరాల్ 39 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టిన రికార్డును హర్ష్ దూబే అధిగమించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 30వ బౌలర్‌గా నిలిచాడు.
మధ్యప్రదేశ్ బ్యాటర్లలో అధర్వ్ మహాజన్ 85 పరుగులు చేసి పోరాడగా, సారాంశ్ జైన్ 34 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. దీంతో మధ్యప్రదేశ్ జట్టు 66.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి విదర్భ జట్టు 23 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ మూడు వికెట్లు పడగొట్టాడు.
Don’t receive OTP? Resend