నటుడు, గాయకుడు దిల్జీత్ దోసాంజ్తో చెలరేగిన వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వెనక్కి తగ్గారు. దిల్జీత్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టిన ఆయన.. తన వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించాలని కోరారు. తనకు దిల్జీత్పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, ఆయనంటే ఇప్పటికీ ఎంతో గౌరవం, అభిమానం అని స్పష్టం చేశారు. భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన తీరును కొనియాడారు.
ఈ ఏడాది జూన్లో కాక్రోజ్ జనతా పార్టీ దిల్లీలో నిర్వహించిన ఆందోళనల సమయంలో దిల్జీత్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నిరసనలకు మద్దతు ఇస్తారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ తాను కేవలం ఆర్టిస్టునని, రాజకీయ నాయకుడిని కాదన్నారు. నాడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను అభిజీత్ దీప్కే తప్పుబట్టారు. సామాజిక అంశాలపై సినిమా చేస్తూ విద్యార్థుల ఉద్యమంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం దిల్లీలో జరిగిన తన కచేరీలో దిల్జీత్ ఈ వివాదంపై స్పందించారు. తాను మౌనంగా ఉంటున్నానని, తనను అలాగే ఉండనివ్వాలని, ఎలా పోరాడాలో పంజాబీలకు నేర్పించకండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దిల్జీత్ వ్యాఖ్యల అనంతరం స్పందించిన అభిజీత్ దీప్కే.. నిరసనల వేళ ఆయన వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని తెలిపారు. నన్ను మీ తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Don’t receive OTP? Resend