ఆంధ్రప్రదేశ్ లో మురసు తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తున్నారు. తుపాను ముప్పు ఉన్న జిల్లాల్లో అధికార యంత్రాంగం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తీర ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతటి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Don’t receive OTP? Resend