వైజాగ్-బెంగళూరు వందేభారత్ స్లీపర్ ప్రతిపాదన
విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్ రైలు నడిపేందుకు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రతిపాదించింది. సాధ్యాసాధ్యాలు, మార్గమధ్యంలో ఇతర రైళ్ల క్రాసింగ్స్, ప్రతిపాదిత టైమింగ్స్ తదితర అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని దక్షిణ పశ్చిమ రైల్వేతో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డీఆర్ఎంలకు సర్క్యులర్ జారీ చేసింది.
Login
Comments (0)