తుపాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణం కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 30కి పైగా విమానాలు రద్దు లేదా ఆలస్యమైనట్లు నివేదికలు వెల్లడించాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల సర్వీసులపై ప్రభావం పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే ఇండిగో విమానాలు కూడా రద్దైనట్లు సమాచారం. ప్రయాణికులు విమాన స్థితిని సంబంధిత సంస్థల ద్వారా నిర్ధారించుకోవాలి.
Don’t receive OTP? Resend