అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో మస్క్ భారీగా ఖర్చు చేశారని, ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం దక్కిందని దుయ్యబట్టారు.
ట్రంప్ గెలుపు తర్వాత ఎలాన్ మస్క్ సంపద ఏకంగా 696 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.66 లక్షల కోట్లు పెరిగిందని బెర్నీ సాండర్స్ ఎద్దేవా చేశారు. ఈ భారీ సంపద పెరుగుదలతో మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించారని గుర్తుచేశారు. అయితే మస్క్ ఇక్కడితో ఆగకుండా అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల పట్టును మరింత కొనసాగించేందుకు మరో 366 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
కుబేరుల రాజ్యమైన ఒలిగార్కీకి వెంటనే ముగింపు పలకాలని, ఎలాన్ మస్క్ చర్యలను అడ్డుకోవాలని సాండర్స్ పిలుపునిచ్చారు. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు అనుమతుల జాప్యంపై మస్క్ ఇటీవల చేసిన విమర్శలు, అలాగే దేశీయంగా రిలయన్స్ వంటి సంస్థలపై సాగిన చర్చల నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లోనూ ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Don’t receive OTP? Resend