ట్రంప్ క్యాబినెట్ నుంచి తులసి గబ్బార్డ్ రాజీనామా
అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ (Director of National Intelligence) పదవికి తులసీ గబ్బార్డ్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన భర్త ఆరోగ్య సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తులసీ గబ్బార్డ్ భర్త ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె రాజీనామా జూన్ 30 నుంచి అమలులోకి రానుంది. ఇదిలా ఉండగా, ఇరాన్-అమెరికా యుద్ధ అంశంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో తులసీ గబ్బార్డ్‌కు విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్వేత జాతీయురాలైన తులసి హిందూ మతాన్ని అవలంబింస్తారు.
Login
Comments (0)