అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ప్రత్యేక అధికారుల కమిటీని నియమించింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కమిటీ ఛైర్మన్గా, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ కార్యదర్శి కె. కన్నబాబు సభ్యులుగా వ్యవహరిస్తారు. 1987 ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం ఈ నియామకం జరిగింది. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు లేదా ఏడాది పాటు – ఏది ముందైతే అప్పటివరకు కమిటీ కొనసాగుతుంది. పాలకమండలి అధికారాలు, విధులను ఈ కమిటీ నిర్వహిస్తుంది.
Don’t receive OTP? Resend