తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రూ.2 లక్షల బీమా సదుపాయం కల్పించాలని తితిదే పాలక మండలి నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా ఎల్ఐసీ ద్వారా సహజ మరణానికి ఈ బీమా వర్తిస్తుందని ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఇందుకోసం తితిదే నిధుల నుంచి ఎల్ఐసీకి రూ.2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రమాద మరణాల్లో ఉద్యోగుల కుటుంబాలకు బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది.
Don’t receive OTP? Resend