తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు ఇక ఎయిర్‌పోర్టులోనే ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విదేశీ భక్తులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుపతి చేరుకోవచ్చు. అక్కడే ఈ-వీసా ప్రక్రియ పూర్తి చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
Don’t receive OTP? Resend