టెక్సాస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో H1B వీసాల ప్రక్రియ నిలిపివేత
అమెరికాలోని టెక్సాస్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు హెచ్ 1 బి వీసాలని నిలిపేస్తూ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. 2027 మే 31 వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా (H-1B Visa) ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోందని, అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని అబాట్ వ్యాఖ్యానించారు. ఈ వీసాల ప్రభావంపై సమీక్ష పూర్తయ్యేవరకు, హెచ్ 1 బి వీసాల అప్లికేషన్లను నిలిపేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు.
Login
Comments (0)