మార్చిలో H1B వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం, మెరిట్, పెద్ద వేతనం ప్రాతిపదిక
హెచ్-1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ మార్చి నాలుగో తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. మార్చి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన మార్పులకి అనుగుణంగా లాటరీలో మెరిట్, అధిక వేతనం ఉన్న వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. నైపుణ్యం ఆధారిత వెయిటెడ్ సెలక్షన్ పద్దతిని అమలు చేస్తారు. ఇదే సమయంలో మల్టిపుల్ రిజిస్ట్రేషన్లను అనుమతించరు. మార్చి 31, 2026 నాటికి ఎంపికైన వారి వివరాలను వెల్లడించనున్నారు.
Login
Comments (0)