ఫ్రిస్కో నగరంలో ఇండియన్లు పెరిగిపోవటంపై నిరసన
డెస్క్: టెక్సాస్ లోని ఫ్రిస్కో (Frisco) నగరంలో ఇండియన్ల జనాభా పెరిగిపోవడంపై కౌన్సిల్ సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి. సమావేశంలో కొందరు హెచ్-1బీ వీసాకు, ఇండియన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసాల జారీలో మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వీరంతా ఫ్రిస్కోకు చెందిన వారు కాదు. ఈ వ్యాఖ్యలను సమావేశంలో పాల్గొన్న అనేకమంది ఇండో- అమెరికన్లు తీవ్రంగా ఖండించారు. నగరంలో నివసించే భారతీయులకు ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ మద్దతుగా నిలిచారు. కాగా, ఫ్రిస్కోలో 2010లో 10 శాతంగా ఉన్నఇండియన్ల సంఖ్య ఇప్పుడు 33 శాతానికి పెరిగింది.
Login
Comments (0)