తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించారు. బ్యారేజ్‌ను 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని తెలంగాణ ప్రతిపాదించింది. గతంలో 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించగా, ఆ ఎత్తుతో ఆశించిన స్థాయిలో నీటిని తరలించడం సాధ్యం కాదని రేవంత్ పేర్కొన్నారు. బ్యారేజ్ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రభావంపై చర్చించి, 152 మీటర్ల ప్రతిపాదనకు మహారాష్ట్రను ఒప్పించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది.
Don’t receive OTP? Resend