వీరిలో మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన వారే ఎక్కువ.. 14 మంది అమెరికా పౌరులు
హైదరాబాద్, దిల్లీ: నేపాల్‌లో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తులో తెలంగాణకు చెందిన 23 మంది ఎన్ఆర్ఐలు చిక్కుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు అధికారులు తెలిపారు.
వీరిలో ఎక్కువ మంది నేపాల్ మీదుగా టిబెట్‌కు వెళ్లి మానసరోవర్ యాత్రకు బయలుదేరినవారు లేదా యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్నవారని అధికారులు భావిస్తున్నారు.
ఈ యాత్ర కోసం కొందరు ఈషా ఫౌండేషన్, ఈషా గ్రూప్, కైలాశ్ జర్నీ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ కైలాశ్ తదితర ట్రావెల్, పర్యాటక సంస్థల సేవలను వినియోగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వద్ద నమోదైన వివరాల ఆధారంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వీరు యాత్రకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
14 మంది అమెరికా పౌరులు
గుర్తించిన 23 మందిలో 14 మంది అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా పౌరసత్వం ఉన్నవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పటివరకు ఒక వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారణ కాగా, మిగిలిన వారి పరిస్థితి, ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉంది. దిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
యాత్రకు వెళ్లిన వారిలో కొందరి వివరాలు
అమెరికా పౌరులు: వందన చంద్, శ్వేత పుట్టా, సాయిప్రసాద్ సోమయాజులు, లక్ష్మీనాథ్ గోపిశెట్టి, సుధీంద్ర యాపాల్పర్వీ, సుధీర్ రంగు, కేశవ్‌రావు తాడిపత్రి, వివేక్ శంకర్ శ్రీవాస్తవ్, వెంకటరమణ, బాలసుబ్రహ్మణ్యం, వెంకటకృష్ణ, రఘునాథరావు, క్రితికుమార్ ఆచార్య తదితరులు ఉన్నారు.
ఇతర దేశాల పౌరులు: ఆగస్త్య గోపికృష్ణనాయుడు (ఆస్ట్రేలియా), వినయ్‌కుమార్‌రెడ్డి (కెనడా), సుహాసినిరెడ్డి కందిమల్ల (న్యూజిలాండ్).
గుర్తింపునకు సంబంధించిన పూర్తి వివరాలు అందని వారిలో గాయత్రి భరత్ (శర్మ ట్రావెల్స్ కైలాస్), నాగజ్యోతి లోల్ల ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్‌లు
నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.
తెలంగాణ సచివాలయం:
ఎస్. లక్ష్మీనారాయణ (సహాయ కార్యదర్శి): 98853 71189
కె. శ్రీనివాస్‌రెడ్డి (సెక్షన్ అధికారి): 79979 59754
ఇ. చిట్టిబాబు (సెక్షన్ అధికారి): 94408 54433
దిల్లీ తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్:
98719 99044
99493 51270
96185 97969
Don’t receive OTP? Resend