విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా సుస్మిత కొణిదెలను నియమిస్తూ ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల సౌకర్యాలు, దసరా నవరాత్రుల వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణ, ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొని సూచనలు, సలహాలు అందించనున్నారు. దేవాదాయ శాఖ కార్యదర్శి ఎం. హరిజవహర్‌లాల్ ప్రభుత్వ సూచనల మేరకు సంబంధిత అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
Don’t receive OTP? Resend