కెబిఆర్ పార్కు చుట్టూ చెట్ల నరికివేతపై స్టే
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేబీఆర్ పార్క్‌కు 35 మీటర్ల పరిధిలో చెట్లను నరకవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులు సుప్రీంకోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
Login
Comments (0)