బుమ్రాని ఫుట్ బాల్ ప్లేయర్ అన్న రామ్ చరణ్
నటుడు రామ్‌చరణ్ క్రికెటర్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు. రామ్‌చరణ్ హీరోగా వస్తోన్న ‘పెద్ది’ మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం భోపాల్‌లో శనివారం జరిగింది. ఈ వేడుకలో రామ్‌చరణ్ చేసిన ఓ పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేదికపై క్రికెటర్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ హాస్ట్ ర్యాపిడ్ ఫైర్ నిర్వహించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ తడబడ్డారు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాకు తాను అభిమానినంటూ చెప్పారు. అయితే బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొన్నారు. దీంతో చరణ్‌పై మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.
Login
Comments (0)