తెలుగమ్మాయి రాగ్వికకు రెండు అంతర్జాతీయ పతకాలు
విజయవాడ: అంతర్జాతీయ చెస్ పోటీల అండర్-8 బాలికల విభాగంలో తెలుగమ్మాయి యెర్నేని రాగ్విక రెండు పతకాలు సాధించింది. ర్యాపిడ్ విభాగంలో రజతం, స్టాండర్డ్ విభాగంలో కాంస్య పతకం గెలిచి ప్రతిభ చాటింది. విజయవాడ సమీపంలోని తాడిగడపకు చెందిన రాగ్విక ఈ విజయంతో రాష్ట్ర యువ చెస్ క్రీడాకారిణుల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.
Login
Comments (0)