అమరావతి: ఏషియన్ గేమ్స్-2026లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ఉండవల్లి నివాసంలో తండ్రి సురేంద్రకుమార్‌తో కలిసి ఆమె లోకేశ్‌ను కలిశారు. ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలు సహా ఆరు పతకాలు సాధించిన సురేఖను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
Don’t receive OTP? Resend