ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని జట్నీలో ఆర్బీఐ గ్రీన్‌ఫీల్డ్ డేటా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ పాలనలో ఒడిశా యువత కన్న కలలు సాకారమవుతాయని, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తోందని చెప్పారు. ఖనిజ సంపదను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ డేటా కేంద్రం జగన్నాథుడు ప్రసాదించిన వరమని, ఇది దేశ ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో రాష్ట్రం అద్భుత విజయాలు అందుకోనుందని, మేం దీన్ని సాధిస్తామన్న నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ బ్రజ్మోహన్రామ్, ముఖ్యమంత్రి మోహన్చరణ్మాఝి, ఉప ముఖ్యమంత్రులు కనకవర్ధన్ సింగ్‌దేవ్, ప్రభాతి పరిడ పాల్గొన్నారు. అలాగే కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జోయల్ ఓరం, ఆర్బీఐ గవర్నరు సంజయ్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
Don’t receive OTP? Resend