ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకమవుతుందని, విశాఖ ఎకనమిక్ రీజియన్‌కు కొత్త అవకాశాలు తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభానికి అవసరమైన ఎనిమిది కీలక అనుమతులు ఇప్పటికే లభించినట్లు అధికారులు వెల్లడించారు.
Login
Comments (0)