మేడారం మహాజాతరలో న్యూజిలాండ్ మావోరి ట్రైబ్స్ సందడి చేశారు. గద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మావోరి తెగ ప్రతినిధులతో కలిసి మంత్రి సీతక్క నృత్యం చేసి, వారిలో ఉత్సాహం నింపారు. ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్కసారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్ దేశానికి చెందిన మావోరి తెగ (మావోరి ట్రైబ్స్) ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని వారు ప్రదర్శించారు.
హాకా (Haka) నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా న్యూజిలాండ్ కళాకారులతో కలిసి నృత్యం చేసి, వారిలో ఉత్సాహాన్ని పెంచారు.
Don’t receive OTP? Resend