శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. 109 మంది ప్రయాణికులతో ముంబయికి బయల్దేరిన ఏఐ 417 విమానంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ వెంటనే ఏటీసీకి సమాచారం అందించడంతో అధికారుల సూచన మేరకు విమానాన్ని తిరిగి శంషాబాద్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సాంకేతిక సిబ్బంది విమానాన్ని పరిశీలిస్తున్నారు.
Don’t receive OTP? Resend