అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన దారం సుప్రియ (30) మృతి చెందారు. ఆమె మరణ వార్త తెలుసుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుప్రియ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మృతురాలి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
మంత్రి పొంగులేటి సూచన మేరకు ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సింహాద్రినగర్‌లోని సుప్రియ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి బాధితులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారులను సంప్రదించామని, త్వరలోనే మృతదేహాన్ని స్వదేశానికి రప్పిస్తామని ఎంపీ భరోసా ఇచ్చారు.
Don’t receive OTP? Resend