అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (46), కంట్రీ గాయని అలెక్సిస్ విల్కిన్స్ (27) నిశ్చితార్థం చేసుకున్నారు.
ఆదివారం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విల్కిన్స్ తన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ పటేల్‌తో దిగిన ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నారు. “Went and got the law involved” అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. పటేల్ కూడా ఆ పోస్టును రీపోస్ట్ చేస్తూ హార్ట్, ఉంగరం ఎమోజీలతో స్పందించారు.
ఇద్దరూ 2022లో నాష్‌విల్లేలో ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారని, 2023లో వారి సంబంధం ప్రారంభమైనట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2025 ఫిబ్రవరిలో పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా విల్కిన్స్ హాజరయ్యారు.
విల్కిన్స్ కంట్రీ గాయనిగా, రాజకీయ వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. ఆమె తొలి ఈపీ ‘Grit’ 2023లో విడుదలైంది. సంప్రదాయ కంట్రీ సంగీతంతో పాటు సమకాలీన, రాజకీయ అంశాలపై కూడా ఆమె రచనలు, ప్రదర్శనలు చేస్తున్నారు.
కాష్ పటేల్ ఎవరు?
భారత సంతతికి చెందిన పటేల్ 2025లో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అమెరికా అత్యున్నత ఫెడరల్ దర్యాప్తు సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
Don’t receive OTP? Resend