భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక స్వదేశీ అస్త్రం వచ్చి చేరింది. డీప్ సీ డైవింగ్ సపోర్ట్ వెస్సెల్గా రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ నిపుణ్ అధికారికంగా జలప్రవేశం చేసింది. విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ సంస్థ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించింది.
సముద్ర జలాల్లో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో ఐఎన్ఎస్ నిపుణ్ రాకతో ఇండియన్ నేవీ సామర్థ్యం మరింత పటిష్ఠమైంది. ఈ నౌక ఏకంగా 300 మీటర్ల లోతులో సైతం ఎలాంటి ఆపరేషన్లు అయిన సజావుగా నిర్వహించగలగడం దీని ప్రత్యేకత.
ముఖ్యంగా సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న సబ్మెరైన్లను అత్యంత వేగంగా కాపాడే ర్యాపిడ్ రెస్క్యూ సామర్థ్యం ఐఎన్ఎస్ నిపుణ్ సొంతం. దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక చేరికతో సముద్ర రక్షణ రంగంలో భారత్ శక్తి సామర్థ్యాలు మరింత ఇనుమడించాయి.
Don’t receive OTP? Resend