ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా అయిదు వందల రోజుల కాలవ్యవధితో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రకటించింది. స్పెషల్ అక్షయ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద సాధారణ వినియోగదారులకు 6.85 శాతం వార్షిక వడ్డీని బ్యాంక్ అందించనుంది. సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ చెల్లిస్తామని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
రూపాయల మూడు కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. ఎంపిక చేసిన కాలవ్యవధులపై వడ్డీ రేట్లను కూడా సవరించింది. ఏడాది కాలవ్యవధి కలిగిన ఎఫ్డీపై 6.6 శాతం, ఏడాది నుంచి మూడేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్డీపై వడ్డీని 6.7 శాతానికి పెంచింది.
సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ రెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. తక్కువొడ్డీ కాలంలో డిపాజిట్ చేయాలనుకునే ఖాతాదారులకు ఈ ప్రత్యేక పథకాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Don’t receive OTP? Resend