న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివిస్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే సులభంగా ఛేదించింది.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 113 పరుగులు సాధించి మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
శతకం పూర్తి చేసుకున్న అనంతరం అభిషేక్ శర్మ మైదానంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పిచ్‌పై కూర్చొని పద్మాసనంలో యోగా ధ్యాన ముద్ర వేసి 'ఓం నమఃశివాయ' మంత్రాన్ని జపించాడు. ఈ ప్రత్యేకమైన సంబరాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Don’t receive OTP? Resend