డబ్ల్యూపీఎల్ 2027 వేలం ముగిసింది. మొత్తం 27 స్లాట్ల కోసం జరిగిన ఈ వేలంలో 150 మంది ఆటగాళ్లు పాల్గొనగా వివిధ ఫ్రాంఛైజీలు 25 మందిని దక్కించుకున్నాయి.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సోఫీ మాలిన్యూ ఈ వేలంలో అత్యధిక ధర పలికింది. రూ.50 లక్షల బేస్ ధర కలిగిన ఈమెను యూపీ వారియర్స్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. భారత బ్యాటర్ కిరణ్ నవ్‌గిరేను రూ.75 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోగా, వికెట్‌కీపర్ జి కమలిని రూ.40 లక్షలకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఆసీస్ ఆల్‌రౌండర్ జెస్ జొనాసెన్ రూ.40 లక్షలకు ఆర్సీబీ పరం అయింది.
కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఉమా కాష్విని రూ.10 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. డబ్ల్యూపీఎల్ వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా కాష్వి చరిత్ర సృష్టించింది. నిరుడు అండర్-19 టోర్నమెంట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ముంబయి బ్యాటర్ ఇరా జాధవ్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది.
వివిధ జట్లు దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయి ఇండియన్స్ జట్టు శ్వేతా సెహ్రవత్, దీక్ష కాసాత్, భారతి రావల్, లతికా ఇనామ్దార్, అక్షిత భగత్, సానికా చాల్కేలను తీసుకుంది. యూపీ వారియర్స్ సోఫీ మోలినిక్స్, గ్రేస్ హారిస్, సుష్మా వర్మ, స్నేహ్ రాణా, ఆశా శోభనా, సహానా పవార్, మనాలి దక్షిణి, క్యాథరిన్ బ్రైస్లను దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ జి.కమలిని, ఒర్లా ప్రెండర్‌గాస్ట్, సమైరా రాఘవ్‌లను కొనుగోలు చేసింది. దిల్లీ క్యాపిటల్స్ కిరణ్ నవ్‌గిరే, నజ్మా ఖాన్, కిర్స్టీ గోర్డాన్, ఉమా కాష్విలను తీసుకోగా, ఆర్సీబీ జట్టు జెస్ జొనాసెన్, తేజల్ హసబ్నిస్, క్లో ట్రైయాన్, వ్రిందా దినేశ్‌లను సొంతం చేసుకుంది.
Don’t receive OTP? Resend