కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు రావాల్సిన ఎయిరిండియా విమానం తీవ్రంగా ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరాల్సి ఉంది. అయితే గంటలు గడుస్తున్నా విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
విమాన రాకపోకల ఆలస్యంపై ఎయిరిండియా సిబ్బంది నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం అందకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు అధికారులతో వాగ్వాదానికి దిగి అసహనం వ్యక్తం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా ప్రయాణికులను గంటల తరబడి నిరీక్షించేలా చేయడంపై మండిపడ్డారు.
జాబితాలో ఏపీ మంత్రి
ఈ విమానంలో ప్రయాణించాల్సిన వారిలో ఆంధ్రప్రదేశ్ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలు తారుమారై తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Don’t receive OTP? Resend