హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి దంచికొట్టిన వానతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సాయంత్రం వేళ కార్యాలయాలు ముగించుకుని ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
యూసఫ్‌గూడ శ్రీకృష్ణనగర్‌లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. మణికొండ, రాయదుర్గం, షేక్‌పేట, తుర్కయంజాల్, మన్నెగూడ, కాప్రా, కీసర, నాగారం, టోలిచౌకి, కార్వాన్, రాజేంద్రనగర్, మెహదీపట్నం ప్రాంతాల్లో వాన పడింది. అలాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలచిపోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు నానాటిపాట్లు పడాల్సి వచ్చింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఇళ్ల చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Don’t receive OTP? Resend