తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి నవంబర్ నాలుగో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
నేడు సాయంత్రం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ తోపాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నవంబర్ రెండు మరియు మూడో తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార వర్గాలు వెల్లడించాయి.
Don’t receive OTP? Resend