మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న టాక్‌షోను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ‘మెగావర్స్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ షోలో సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. తొలి రోజు చిత్రీకరణలో హాస్య నటులు బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
Don’t receive OTP? Resend