అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇచ్చిన చిరంజీవి
హైదరాబాద్: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా విజయం సాధించినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి గిఫ్ట్ ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును చిరంజీవి కానుకగా ఇచ్చారు. కారు నచ్చిందా? అని చిరంజీవి అడగ్గా ‘మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్’ అంటూ అనిల్ నవ్వులు పంచారు. ఇప్పటివరకు రూ.300 కోట్లకుపైగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో నడుస్తోంది.
Login
Comments (0)