తుపాను ప్రభావం, రాష్ట్రంలో ముందస్తు సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా, కలెక్టర్లు, ఆర్టీజీ, వ్యవసాయ, విద్యుత్, సాగునీటి, హోంశాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. వైద్య, పౌరసరఫరాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.
సహాయక చర్యల కోసం 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందించడంతోపాటు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు ప్రణాళికతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సముద్రంలో వేటకు వెళ్లిన పడవలు సురక్షితంగా తీరానికి చేరుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వరద నీటితో రిజర్వాయర్లను నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
Don’t receive OTP? Resend