ఆంధ్రప్రదేశ్ లోని అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్న ఒక ప్రత్యేక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. విదేశీ ప్రాంతాలను తలపించేలా ఉన్న ఈ సుందర దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇది స్విట్జర్లాండ్ కాదని, మన ఆంధ్రప్రదేశేనని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చీడిక గ్రామానికి చెందిన కొండ దొరరాజు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఈ అందమైన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మొదట షేర్ చేశారు. చీడిక పరిసర ప్రాంతాల్లోనే ఈ దృశ్యాలను అత్యంత ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ వీడియోను గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు, దాన్ని తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో రీపోస్ట్ చేశారు.
ఈ అద్భుతమైన రీతిలో ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరించిన ఇన్ఫ్లూయెన్సర్ కొండ దొరరాజుకు చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి అందాలను సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్న తీరును పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తెగ ప్రచారమవుతోంది.
Don’t receive OTP? Resend